బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు... కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలు కార్పోరేట్ దవాఖానల చుట్టూ తిరుగుతూ డబ్బును వృథా చేసుకోకుండా బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల, స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ సన్నరవి యాదవ్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, కోఆప్షన్ సభ్యుడు వెంకటేష్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, షేక్ రియాజ్, మహేష్, యాదగిరి, మధు తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…