SAKSHITHA NEWS

500-beneficiaries-of-the-constituency-are-dalit-relatives

నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు.


సాక్షిత : విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నూతన కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు పథకం పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

★ ఎంపిక చేసే లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించి, సరైన యూనిట్ లను ఎంపిక చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

★ మంజూరైన యూనిట్ ల పనులు వేగవంతం కొరకు లబ్ధిదారులతో సమన్వయం చేస్తూ… త్వరగా పూర్తిచేయాలన్నారు.

★ యూనిట్ ల నిర్వాహణను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

★ అనంతరం మహిళల్లో రక్త హీనత మరియు జాండిస్ తదితర అనారోగ్యలకు గురి కాకుండా మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు.

★ 5th రాష్ట్రీయ పోషన్ Maah 2022 వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల , ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS