హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం
నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను సమావేశానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని భారాస నిర్ణయించింది…..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ కు బయలుదేరి వెళ్లారు.…