ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బోనకల్లు పోలీస్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జగ్గయ్యపేట నుంచి రాజమండ్రికి వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. ఏపీ 16 టి వై 6599 నెంబర్ గల
లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 బస్తాలు /ఇరువై టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ బియ్యం ఎక్కడి నుంచి సేకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరు ఈ పనికి పురామయించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారని, ప్రాథమికంగా
షేక్ మస్తాన్ 30 సం, డ్రైవర్ జగ్గయ్యపేట. – షేక్ ఇనౌతుల్లా 40 సం, యజమాని నివాసము జగ్గయ్యపేట. ఆర్గనైజర్ ఆత్మకూరి జగదీష్ నివాసం ఖమ్మం. పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలనే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ర్రాష్ట్ర సరిహద్దు రవాణాపై నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని
వెల్లడించారు.