నిందితుల వద్ద నుండి నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం
నిందితులను పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్
మీడియా సమావేశంలో గురజాల డిఎస్పీ పల్లపురాజు, కారంపూడి సీ.ఐ దార్ల. జయకుమార్
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బెట్టింగ్ ముఠా సభ్యులను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు గురజాల డిఎస్పి పల్లపురాజు, కారంపూడి సి.ఐ దార్ల. జయకుమార్ తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ రెంటాల గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని అందిన సమాచారం మేరకు రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. రెంటాలకు చెందిన సేరెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఇంట్లో గోంటు.
రవికిరణ్ రెడ్డితో కలిసి ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ జరుగుతుండగా ఎస్.ఐ వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారని డిఎస్పి, సి.ఐ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుండి ల్యాప్ టాప్ , నాలుగు సెల్ ఫోన్లు, లక్ష పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పి, సి.ఐ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి లు హైదరాబాద్ లో ఉంటూ పల్నాడు జిల్లా మరియు చుట్టూ పక్కల జిల్లాలలో సబ్ బుకీలు, పాంటర్స్ ని ఏర్పాటు చేసుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇందులో గోంటు.రవికిరణ్ రెడ్డి బుకీగా ఉంటూ బెంగళూరులో మెయిన్ బోర్డు పెట్టి లైవ్ ని సబ్ బుకీలకు ఇస్తూ క్రికెట్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్నారని క్రికెట్ బెట్టింగ్ సంబంధించి మరికొందరు సబ్ బుకీలను, పాంటర్స్ ను గుర్తించడం జరిగిందని త్వరలోనే మిగితావారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు ఈ సందర్బంగా హేచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్న రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్ ను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గురజాల డిఎస్పీ పల్లపురాజు, కారంపూడి సి.ఐ దార్ల. జయకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.