31వ వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చానని… ప్రజల మెప్పు పొందడం. సంతృప్తినిచ్చిందన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి
సాక్షిత : 31వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వార్డు ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేస్తూ ప్రధానంగా రోడ్డు, డ్రైన్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి రోడ్లు, డ్రైనేజ్ వేయించాకే తాను వార్డులో అడుగుపెడతానని నాడు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 31వ వార్డులో 23లక్షల 50వేల రూపాయలతో నిర్మించిన రోడ్డు, డ్రైనేజ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. వీరితోపాటు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్ పాంషావలి, స్థానిక కౌన్సిలర్ అనురాధ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో వినూత్నమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమన్నారు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను వారి గడప వద్దకు వెల్లి తెలుసుకొని వారి సంక్షేమాభివృ ద్ధిని చేపట్టడం జరుగుతుదన్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా 31వ వార్డులో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రజలు సి సి రోడ్డు, డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నామని, వాటిని చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. వారికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సంతోషం చూస్తుంటే తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. అలాగే వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ పుల్లమ్మ, వెంగల్రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య గౌడ్, భాస్కర్రెడ్డి, మునాఫ్, బషీర్, మున్సిపల్ ఇంజనీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.