SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి , ఆయా వార్డుల కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ అధికారులు.

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

WhatsApp Image 2023 10 09 at 1.16.21 PM

SAKSHITHA NEWS