8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

Spread the love

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం

-సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది….

-ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం…

గుడివాడ02:గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 8 రోజుకు చేరుకుంది . 27వ వార్డు బేతవోలులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలినానికు బేతవోలు సెంటర్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు , ప్రజానీకం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, వీధి వీధినా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు నిర్వహించిన సర్వమత ప్రార్ధనల్లో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు.వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు పూల వర్షాలు..గజమాలలతో స్థానికులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

వార్డులోని దేవాలయాల్లో ఎమ్మెల్యే నాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్నారు. వీధి వీధినా పూల మాలలు, శాలువాలతో ఎమ్మెల్యే నానీకు ప్రజానీకం స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా తమకు పెన్షన్ నగదు అందలేదని పలువురు వృద్ధులు ఎమ్మెల్యే నాని వద్ద వాపోగా…. ప్రతి ఒక్కరికి పెన్షన్ నగదు అందుతుందని, రెండు నెలలు ఆగితే వైసీపీ ప్రభుత్వంలో తిరిగి ఇంటి వద్దకే పెన్షన్ నగదు అందించేలా చర్యలు తీసుకుంటామని తనను కలిసిన వృద్ధులతో, ఎమ్మెల్యే నాని అన్నారు.పలు ప్రాంతాల్లో అబివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చటించారు. పర్యటనలో భాగంగా వార్డులోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నా ప్రతిపక్ష కూటమికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ఆయన అన్నారు.


మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా అని కొడాలి నాని ప్రశ్నించారు. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదని, అర్హతే ప్రామాణికంగా , ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా అదుపుతున్న ప్రభుత్వ సహాయం పై రాష్ట్రంలోని పేద వర్గాలు ఎంతో సంతృప్తిగా ఉన్నాయని….. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు.ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, జడ్పిటిసిలు గోళ్ళ రామకృష్ణ ,కందుల దుర్గా కుమారి,ఎంపీపీలు పెయ్యల ఆదాం,గద్దె పుష్పరాణి,కొడాలి సురేష్, వైస్ ఎంపీపీలు బొట్టు నాగలక్ష్మి,పూడి సుధాకర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ,ఉపాధ్యక్షుడు అలిబెగ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, బిసి సెల్ అధ్యక్షుడు నైనవరపు శేషు బాబు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు డోక్కు రాంబాబు, యువత రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తులిమిల్లి యషయ్య,వికలాంగుల విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ దొండపాటి మదుకిరణ్, మహిళా విభాగ అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ నగుళ్ల సత్యనారాయణ,
27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
బెజవాడ రామ్ ప్రసాద్, ముదవ వెంకట రమణ, మాజీ కౌన్సిలర్ బెజవాడ నాగలక్ష్మి, వీరిశెట్టి నరసింహారావు, పత్తిపాటి అశోక్, తోకల రాంబాబు, పత్తిపాటి ఆనంద వరలక్ష్మి, బెజవాడ సుబ్రహ్మణ్యం, వీరంకి ప్రకాశరావు, పడమట పెద్దిరాజు, పడమట సురేష్, శొంఠీ ఉమామహేశ్వరరావు, శొంఠీ బైరాగి, పసుపులేటి నరేష్, బోయిన పాపారావు, పండూరి కిరణ్, బోయిన బోసు, బెజవాడ సూర్యనారాయణ.

నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమన్, చుండురి శేఖర్, అగస్త్యరాజు కృష్ణమోహన్, కొంకితల ఆంజనేయ ప్రసాద్,రమణ కుమార్, కృష్ణ కిషోర్ ,రావులకొల్లు సుబ్రమణ్యం, రావుల కొల్లు నాగమల్లేశ్వర రావు, తోటా శివాజీ,షేక్ సయ్యద్,కట్టా రాంబాబు, కే.రవీ ,వీరిశెట్టి నరసింహారావు, జోగా నాగేశ్వరరావు,వెంపల అప్పారావు,మండాది శ్రీను, పర్వతనేని ఆనంద్,అడపా పండు , పంచకర్ల వెంకట్, మహమ్మద్ ఖాసిం అబూ, అబ్దుల్ రజాక్,వడ్లాని సుధాకర్, జ్యోతుల శ్రీను,జ్యోతుల సత్యవేణి, మూడేడ్ల ఉమా,దారం నరసింహారావు, మోండ్రు వెంకటేశ్వరరావు, జోగా సూర్య ప్రకాష్,జోగా కిషోర్, సింగిరెడ్డి గాగారిన్, వంగపండు బ్రహ్మాజీ,లోయ వరాలు, మాదాసు వెంకటలక్ష్మి,లోయ రాజేష్,రిటైర్డ్ సిఐ పి.వెంకట్రావు, నల్లమోతు జగదీష్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పవన్, కలపాలకిరణ్, గానుగుల ఆనందమురళి, చందరాల హరి రాంబాబు, తోట రాజేష్, గుదే రవి, మూడేడ్ల రామారావు,డాక్టర్ ఆర్కె, తోట సాయి, జ్యోతుల మణికంఠ,జూనియర్ జమదగ్ని,జిల్లా యూత్ కార్యదర్శి పాపిసెట్టి ప్రసాద్, నిరుడు ప్రసాద్,బొండాల శ్రీను, అసిలేటి అర్జునరావు, గంటా శ్రీను, ఘంటా సురేష్, కొత్తూరి లక్ష్మీనారాయణ,అల్లం రామ్మోహన్రావు, అడబాల అప్పారావు,దుడ్డు చిన్నా,గొల్ల సోమేశ్వరరావు, జహృద్దిన్, ఖాదర్ బేగ్, సత్తిరెడ్డి, గంటా చంద్రశేఖర్,రజాక్ భాష,పెద్ది రమణ,పిడుగు శ్రీను, చౌటపల్లి కళ్యాణ్, వినోద్, పొట్లూరి మురళి, మామిళ్ల ఎలీషా,dvs శ్యామ్ కుమార్, నండూరి ఉమా శంకర్,కలపాల నాగులు,గొకరకొండ హారినాద్,పుల్లేటికుర్తి కృష్ణ,దుగ్గిరాల శేషు,నల్లూరి శ్రీనివాసరావు, జాగా కిషోర్, తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి,పప్పు యాదవ్, వంగపండు బ్రహ్మాజీ, తోటా నాగరాజు, కందుల నాగరాజు, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి బెనర్జీ, కొండపల్లి కుమార్ రెడ్డి,సర్దార్ బెగ్, కంచర్ల జగన్,రవి స్వీట్స్ మోహన్, కాకుల విష్ణు,ఎండి యాకూబ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అబ్దుల్ రహిం, ఎండి సాలెహా,కొండపల్లి శ్రీనివాసరెడ్డి, క్రేన్ బాబి,కంచర్ల జగన్, దేవరపల్లి కోటి, లోయ కన్నా,యార్లగడ్డ సత్యభుషన్, కోటప్రోలు నాగు, కర్రే నాని, సాల్ట్ బాబ్జి,జొన్నలగడ్డ అజయ్,బెజ్జం సువర్ణ బాబు,పసలాది శేఖర్, దోమ రఘు,మచ్చా పద్మ, రేమల్లి దాస్ కుమార్,కుంభం నాగమణి,దారం కాంచన కుమారి, శేషం నిర్మల , కొండా నాగమయ్య,గిరి బాబాయ్ ,పాలడుగు రామ్ ప్రసాద్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు,గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page