అశ్వారావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం

Spread the love

అశ్వారావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం

జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా

పాల్గొన్న పాల్వంచ డిఎస్పి వెంకటేష్
(సాక్షిత న్యూస్)
అశ్వారావుపేట న్యూస్ : నియోజవర్గ కేంద్రం అయిన అశ్వరావుపేటలో ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ విజయవంతమైంది. అశ్వారావుపేటలోని రింగ్ రోడ్డు సెంటర్ లో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలంగాణ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అశ్వరావుపేట నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులు, విభిన్న వర్గాల ప్రజలు, కార్మికులు, ఆటో యూనియన్స్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా తెలంగాణ రన్ లో పాల్గొన్నారు. పాల్వంచ డిఎస్పి వెంకటేష్, అశ్వారావుపేట సీఐ బొమ్మెర బాలకృష్ణ, ఎస్ఐ రాజేష్ కుమార్, దమ్మపేట ఎస్సై రవికుమార్ లు నేతృత్వం వహించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన తెలంగాణ రన్ విజయవంతం కై కృషి చేశారు.

ఈ తెలంగాణ రన్ అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ నుండి ఖమ్మం రోడ్ లో స్పైసి రెస్టారెంట్, గవర్నమెంట్ హాస్పిటల్, తహశీల్దార్ కార్యాలయం మీదుగా వ్యవసాయ కళాశాల వరకు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన సభలో డీఎస్పీ వెంకటేష్, సీఐ బొమ్మెర బాలకృష్ణ మాట్లాడుతూ పోలీస్ శాఖ చేస్తున్న సేవలను వివరించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు విశిష్ట సేవలు అందించిన శాఖ పోలీస్ శాఖ అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యామని ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రజలకు తెలియజేయాలననే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ప్రారంభించామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను విజయవంతంగా నిర్వహించినందుకు పోలీస్ శాఖను అభినందించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో కలసి శాంతి కపోతాలను ఎగరవేశారు. తెలంగాణ రన్ సందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు కళాశాల ప్లే గ్రౌండ్లో తెలంగాణ మ్యాపు పై విద్యార్థులు కూర్చొని ఏర్పాటుచేసిన తెలంగాణ మ్యాపు చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, ఎక్సైజ్ సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీహరి రావు, దమ్మ పేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, అశ్వారావుపేట తహసీల్దార్ లూథర్ విల్సన్, బండి పుల్లారావు, కాసాని చంద్రమోహన్, యూఎస్ ప్రకాష్ రావు, రాజ మోహన్ రెడ్డి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా, సిపిఎం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, సత్యవరపు సంపూర్ణ, పోలీస్ సిబ్బంది, అశ్వారావుపేట, మండల అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page