SAKSHITHA NEWS

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ కాలనీ కి చెందిన ట్వింకిల్ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,40,000/- ఒక లక్ష నలబై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF వివరాలు

1.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ కాలనీ కి చెందిన ట్వింకిల్ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,40,000/- ఒక లక్ష నలబై వేల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, తిరుపతి యాదవ్, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 06 at 5.23.00 PM

SAKSHITHA NEWS