ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 – మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు..
పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..
ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు..
హాల్టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు..
గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్ వెనక్కి తీసుకున్నామని..
ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని బొత్స అన్నారు.