మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు Synopsys సినాప్సిస్ సాప్ట్ వేర్ సంస్థ వారి సౌజన్యంతో Nirman.org ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ, 3 అదనపు తరగతుల గదులు, సైన్స్ లాబ్ పరికరాలు, గ్రీన్ బోర్డ్ లను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సినాప్సిస్ సంస్థ వారు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని, సినాప్సిస్ ఓదార్యం చాలా గొప్పది అని , ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుడదనే ఉద్దేశ్యంతో సినాప్సిస్ సంస్థ వారు ఎంతో ఓదార్యం తో పేద విద్యార్థులకు మేలు కలిగే విధంగా ఈ రోజు పాఠశాల ప్రాంగణంలో సోలార్ వ్యవస్థ ను 3 అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపట్టడం జరిగినది అని, సైన్స్ ల్యాబ్ పరికరాలు,అన్ని తరగతి గదులలో కొత్త గ్రీన్ బోర్డు లు ఏర్పాటు చేయడం, వితరణ గా ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.


వీటిని చక్కగా సద్వినియోగ పర్చుకొని మంచిగా చదివి తల్లిదండ్రులకు ,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు అదేవిధంగా సినాప్సిస్ సంస్త వారు ఎంతో సహృదయం తో, సామాజిక దృక్పథంతో CSR ఫండ్ కింద పేద విద్యార్థులకు చక్కటి మౌలిక వసతులు వితరణ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ,వారి ఉదరత కు చాలా అభినందనియం అని,ఎమ్మెల్యే గాంధీ సినాప్సిస్ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు చేయూతనందించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం చాలా అభినందించ దగ్గ విషయం అని,ప్రతి ఒక్కరు సినాప్సిస్ సంస్థ ను ఆదర్శంగా తీసుకోవాలని, వీరు ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలిచారని ,సమాజం పట్ల సేవ చేయాలనే తపన సేవ చేయడానికి సినాప్సిస్ సంస్థ వారిని ఎల్లవేళలా ముందు ఉంటారని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.నాయకులు కూడా తమ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లకు ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సినాప్సిస్ సంస్థ site Director శ్రీ నరేంద్ర,Senior manager, శ్రీ నర్సింహ , నిర్మాణ్ సంస్థ కో ఆర్డినేటర్ శ్రీమతి అనురాధ, శ్రీ భార్గవ రామ్, భగవాన్ ,

ప్రధానోపాధ్యాయురాలు వసుంధర దేవి , ఉపాధ్యాయులు బాల్ రెడ్డి ,మదన్ మోహన్ సత్యనారాయణరావు,వీణ ,గౌసియా, మరియు మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు BSN కిరణ్ యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, చంద్రిక ప్రసాద్,మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా ,స్వరూప, ముజీబ్, రోషన్, తిమ్మరాజు, శ్రీ శైలం, రామకృష్ణ,గోల్కొండ రాజు,సాయి, శివ ముదిరాజ్, నరేష్ , చిరు, బాబు రావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page