SAKSHITHA NEWS

You introduced a bogus budget

బూటకపు బడ్జెట్ నీ ప్రవేశపెట్టారు

ఉద్యమకారుల సంక్షేమ ఉసెలేదు

ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్

తెలంగాణా ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్రా అధ్యక్షులు బత్తుల సోమయ్య

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక ఖమ్మం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ మరోసారి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బ చేసే విధంగా బూటకపు బడ్జెట్ ప్రవేశపెట్టారని, అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరుల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం ఉసే ఎత్తలేదు అని విమర్శించారు. ఈ సందర్భంగా భక్తుల సోమయ్య మాట్లాడుతూ 2023-24 రాష్ట్ర బడ్జెట్ లో కొత్తగా ఏమి కేటాయింపులు లేవని
రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరిష్ రావు అంకెల గారడీ, మాయ మాటలతో మేడి పండు మాధిరిగా రంగుల ప్రపంచంలాగా మెఘా బడ్జెట్ గా చూపించారన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు ప్రజలను మభ్య పెట్టడం.. మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెడుతున్నారని గతంలో అనేక మార్లు చెప్పిందే ఇప్పడు నిజమైంది. బడ్జెట్ ను సంపూర్ణంగా అమలు చేయాలన్న చిత్త శుద్ది ఈ ప్రభుత్వానికి ఉంటే వాస్తవిక బడ్జెట్ ను పెట్టే వారు.


రాష్ట్ర బడ్జెట్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

వ్యవసాయానికి 24గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 5గంటలు కూడ నాణ్యతగా ఇవ్వడంలేదని రైతులు ఆందోలన చెందుతున్నారు.
రాష్ర్టంలో ఆనేక జిల్లాల్లో విద్యుత్ కోతలపై రైతులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తుంటే వెలుగులు, జిలుగులంటూ గొప్పగా చెప్పుకోవడం విచారకరం.


రాష్ట్రంలో 50శాతం జనాభా కలిగిన బిసిలకు బడ్జెట్లో కేవలం 6229 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని బట్టీ బిసిలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో తెలుస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నది. ఈ సారి కూడ అదే విధంగా చేసినది.


ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పిన పాలకులు ఈ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రుణ మాఫీ అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16లక్షల మంది రైతులు బ్యాంకులల్లో ఢిఫాలర్టుర్లుగా మారారు. ముఖ్య మంత్రి కేసీఆర్ గిరిజనులకు గిరిజన బంధు ప్రకటిస్తామన్న హామీ ఈ బడ్జెట్లో కన్పించలేదు.
నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో మాటే ఎత్తలేదు.
బిసి యాక్షన్ ప్లాన్ ను విస్మరించారు


బిసి బంధు ఉంటుందని ఆశీంచాము. కానీ ఊసే ఎత్తలేదు.
2014 నుంచి 2022-23 వరకు మాత్రం లిక్కర్ ఆదాయం మాత్రం పెంచుకుంటున్నారు.
నీళ్లు, నిధులు, నియమకాలు, ఆత్మగౌరవం కొరకు తెచ్చుకున్న తెలంగాణలో వీటికి తగ్గట్టగా బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుగలేదు.


పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదులు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేయలేదు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందటంలేదు. ఒక్కటే గదిని తరగతి రూం, రెస్ట్ రూంగా విద్యార్థులు వాడుకుంటున్న దుస్తితి ఉన్నది అని ఆయన అన్నారు.


SAKSHITHA NEWS