అదానీ అంశంపై చర్చకు బీఆర్ఎస్ ఉడుంపట్టు

Spread the love


BRS to discuss the issue of Adani

అదానీ అంశంపై చర్చకు బీఆర్ఎస్ ఉడుంపట్టు

చర్చించేంత వరకు కేంద్రాన్ని వదలం

మళ్లీ నోటీసులు ఇస్తాం

తెలంగాణా బడ్జెట్ అద్భుతం

విలేకరులతో బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ నాయకులు నామ నాగేశ్వరరావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంట్ లో అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనని, అప్పటి వరకు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై చర్చ జరిపేంత వరకు తమ ఆందోళనను మరింత ఉదృతంగా కొనసాగిస్తామని, మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇస్తూనే ఉంటామని వెల్లడించారు. దేశ సమస్యలపై చర్చ జరగాలని అందరూ భావిస్తారని, కానీ తామే ముందుకొచ్చి చర్చ కోరినాకేంద్రం వెనక్కి పోతుందని అన్నారు.పార్లమెంట్ నిబంధనల ప్రకారం సమస్యలపై చర్చ కోరే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుందన్నారు.

నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చి చర్చ కోరాం.. వివక్షాలు కూడా మాతో పాటే నోటీసులు ఇచ్చాయి… అయినా కేంద్రం వాటిని పట్టించుకోకుండా కావాలనే ఈ అంశంలో వెనక్కి వెళుతుందని అన్నారు. ఎల్ ఐసీ, బ్యాంకుల్లో పేదలు, బడుగు, బలహీన వర్గాలు, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును దాచుకున్నారని, అదానీ వ్యవహారం వల్ల తీవ్ర భయాందోళనలు చెందుతూ మానసికంగా ఇబ్బంది పడు తున్నారని అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి తప్పు చేయకపోతే మాకంటే ముందే ఈ అంశంపై కేంద్రం చర్చను కోరాలి…తప్పు చేసింది కాబట్టే కావాలనే తప్పించుకుంటూ వెనక్కిపోతుందన్నారు.

ప్రజల కష్టార్జితాన్ని గుర్తించి, తాము ముందుకు వచ్చి చర్చకు పట్టుబడుతున్నా మొండిగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం ఇప్పటికైనా ముందుకు వచ్చి,పార్లమెంట్లో చర్చ జరిపి,దేశ ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు.

తెలంగాణా బడ్జెట్ అద్భుతం

తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు.ఇది రైతులు, పేదల బడ్జెట్ అన్నారు. రూ. 2లక్షల 90కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయి బడ్జెట్ లేదన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కారణంగానే ఇంత పెద్ద బడ్జెట్ సీఎం ప్రవేశపెట్టారని చెప్పారు.

పర్ క్యాపిటల్ ఇన్ కమ్ లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. గ్రామ, పట్టణాభివృద్ధి జరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నిధులు ఇవ్వకున్నా మేము అభివృద్ధి సాధిస్తున్నాం… ఇస్తే ఇంకా మరింత అభివృద్ధిని సాధించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైతుల రాజ్యం రావాలన్నదే తమ పార్టీ అభిమతమన్నారు. అందుకోసం తమ నాయకుడు కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ఇక మిగతా విషయాలకు వస్తే సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునే వారికి రూ.3.లక్షలు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఏడాది లక్ష ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం తమ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం లేదన్నారు. లక్నోలో పుట్టి, అక్కడే పెరిగిన ఓ విమాన ప్రయాణీకుడు తాను హైదరాబాద్ కి మారిపోయాను అని ఇవాళ తనతో చెప్పాడన్నారు. హైదరాబాద్ లోనే బిజినెస్ లు పెట్టుకున్నాం… ఇంకా విస్తరిస్తామని కూడా చెప్పారన్నారు.

ఇది తెలంగాణా ఖ్యాతికి నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలను హైదరాబాద్ సిటీ అక్కున చేర్చుకుంటుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు 50శాతం నిధులు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టిందని, ఇది కరెక్ట్ కాదన్నారు. కేంద్రమే భూసేకరణ వ్యయాన్ని కూడా భరించాలని నామ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page