వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట

Spread the love

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట.

వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం

కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు

కేంద్ర ప్రభుత్వ తీరు పై కథం తొక్కిన వేలాది మంది మహిళలు

మోడీ డౌన్ డౌన్ ..బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిన జిల్లా కేంద్రం

సూర్యాపేట

పెరిగిన గ్యాస్ ధరలపై తెలంగాణ మహిళలు ఆందోళన బాట పట్టారు. కేంద్రప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు సూర్యాపేటలో భారీ నిరసన చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది గా తరలి వచ్చిన మహిళలు కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి, మోడీ డౌన్ డౌన్ ,గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యం జి రోడ్,తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ వద్దకు చేరుకుంది.

భారీ ఎత్తున తరలి వచ్చిన నారీ లోకం ప్రధాని మోడీ పై తిరుగుబావుటాకు సిద్ధం అంటూ నినాదాలు చేయడంతో పాటు పెంచిన గ్యాస్,ధరల కు నిరసనగా కట్టెల పొయి పై వంటర్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ,ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.

మహిళలు రోజూ వినియోగించే గ్యాస్‌ ధరను ఒక్కరోజులో రూ.50కి పెంచడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని.. లేనిపక్షంలో మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

వంట గ్యాస్‌తో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి మహిళల సత్తా ఏమిటో చూపిస్తామని ధ్వజమెత్తారు మహిళా వ్యతిరేఖ మోడీ ప్రభుత్వాన్ని మహిళలు దేశం నుండి తన్ని తరిమేసే రోజులు వచ్చాయని, ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ కోసం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు తెచ్చి మహిళ లకు అండగా ఉంటే, 400ఉన్న గ్యాస్ ధరను 1200 చేసిన ఘన కీర్తి మోడీ కి దక్కిందన్నారు..

ఈ ఒక్క విషయంలో నే మహిళల పై మోడీ కి ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుంది అన్నారు.. పెంచిన్ గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు మా పోరాటం ఆగదని అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో పెన్ పహాడ్ జడ్పీటిసి మామిడి అనిత, వార్డు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page