BJP పెద్దలా లేక ఢిల్లీ గద్దలా

Spread the love
Whether BJP is big or Delhi hawk

BJP పెద్దలా లేక ఢిల్లీ గద్దలా


సాక్షిత : BJP కుతంత్రానికి నిరసనగా భౌరంపేట్ లో మోదీ దిష్టిబొమ్మ దహనం*

ఉద్యమించి సాధించుకున్న తెలంగాణా లో స్వరాష్ట్ర నాయకుల పరిపాలనను ఓర్వలేక ఢిల్లీ ప్రభుత్వం, TRS ప్రభుత్వ ఎమ్మెల్యే ల కొనుగోలు యత్నించినందుకు నిరసనగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో TRS నాయకులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేసారు.

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ బంగారు తెలంగాణ గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో BJP కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక దిగజారుడు తనంతో TRS ప్రభుత్వాన్ని కులదొయాలన్న కుటిల నీతిని తెలంగాణ సమాజం సహించబోదని అన్నారు.

సీఎం కేసీఆర్ కి తెలంగాణ సమాజం మొత్తం ఎల్లప్పుడూ తోడుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , TRS నాయకులు మురళీ యాదవ్, దర్శన్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , జివేందర్ రెడ్డి, సత్తిరెడ్డి, మన్నె షేకర్, గొనె రాంరెడ్డి, అక్రమ్, ప్రదీప్ రెడ్డి, కిట్టు, చింత మల్లేష్, లక్ష్మణ్, గోపాల్, సోమరాజులు మరియు TRS నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page