We will work to solve the problems
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ
సాక్షిత తిరుపతి : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పిర్యాదులు, అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులను వారు స్వీకరించారు.
12వ వార్డు కార్పొరేటర్ ఎస్.కె.బాబు పోన్ ద్వారా మాట్లాడుతూ తమ వార్డులో తెలుగుగంగ లైన్ వేసారు కాని ఇంటింటికి కనెక్షన్ ఇవ్వలేదని, పద్మావతి కళ్యాణ మండపం వద్ద స్వాగతం ఆర్చ్ పాడైపోయిందని, నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి నాలుగు నెలల ముందు ఇంటి కొళాయి కనెక్షన్ కు డబ్బులు చెల్లించిన ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదని చెప్పడంతో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
హరిచంధ్ర శ్మశానంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అదేవిధంగా సింగాలగుంట కరెంట్ ఆపిసు వెనుకగల అర ఎకరం భూమిని ఆక్రమిస్తున్నారనే పిర్యాదులపై స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఫిర్యాదులో శ్రీనివాసం నుండి అన్నమయ్య మార్గ్ వెళ్లే రూట్లో తవ్వేశారని ఇంతవరకు పూడ్చలేదని చెప్పడంతో సరి చేస్తామన్నారు.
అదేవిధంగా జర్నలిస్ట్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మరో ఫిర్యాదులో తమ కాలనీలో రోడ్లు వేయాలని, తెలుగు గంగ లైన్ వేసినా ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వలేదని చెప్పడంతో పరిశీలించి తగు చర్యలు చేపడుతామన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు సమస్యలు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల గురించి పిర్యాదులు రాగా తమ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, లోకేష్ వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, సెక్రటరి రాధిక, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.