We will investigate your problem within the law and provide a solution – District SP
జిల్లా పోలీస్ కార్యాలయం- మచిలీపట్నం.
మీ సమస్యపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందిస్తాం-జిల్లా ఎస్పీ
స్పందన కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, వాటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ స్పందన కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ అన్నారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి, ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను బదిలీ చేసి పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులలో.
గుడ్లవల్లేరు నుండి ఒక వివాహిత వచ్చి తన వివాహం జరిగి 10 సంవత్సరాల అవుతుండగా తన వివాహ జీవితంలో ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని, అయితే తన భర్త అదనపు కట్నం కోసం మరొక వివాహం చేసుకొని ఫిర్యాదుదారురలికి విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని న్యాయం చేయాలని ఫిర్యాదు
చల్లపల్లి నుండి 80 సంవత్సరాల నరసయ్య అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇరువురికి ఆస్తిని సమానంగా పంచి వేశానని,అయితే పెద్ద కుమారుడు మృతి చెందడంతో కోడలు మనవడు మనవరాలు తో కలిసి ఉంటుండగా, మనవడు ఇంటి నుండి గెంటివేసి ఆ వృద్ధుడి పేర ఉన్న ఆస్తిని మనవడి పేరున రాయాలని లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు.
పమిడిముక్కల నుండి శివ అనే వ్యక్తి వచ్చి తన సమీప బంధువునికి కుటుంబ అవసరాల నిమిత్తం కొంత సొమ్మును అప్పుగా ఇచ్చానని సగం చెల్లించి మిగిలిన సగం రెండు సంవత్సరాలు అవుతున్న చెల్లించకపోగా అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
పెడన నుండి దుర్గ అనే వివాహిత వచ్చి తన భర్త దుర్వసనాలకు బానిసై చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, పెద్దలలో పెట్టినప్పటికీ ప్రయోజనం లేదని, న్యాయం చేయమని ఫిర్యాదు