SAKSHITHA NEWS

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి అంబటి రాంబాబు *

సాక్షిత :అమరావతి, పెదకూరపాడు మండలాల్లో పంటల పరిశీలన
*మంత్రి అంబటి రాంబాబు, జాయింట్ కలెక్టర్ తో కలిసి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు *

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , జాయింట్ కలెక్టర్ తో కలిసి మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అమరావతి మండలంలోని నరుకుళ్లపాడు, ఎండ్రాయితో పాటు పెదకూరపాడు మండలంలోని పరస, కంభంపాడు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. రైతులు వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని మంత్రి కి, ఎమ్మెల్యే కి, అధికారులకు వివరించారు. మేడ వాగు వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. వారి ఇబ్బందులను విన్న మంత్రి అంబటి రాంబాబు , ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వారికి తగిన న్యాయం జరిగే విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

*నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి అంబటి రాంబాబు *

రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో ప్రతి చోటా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారన్నారు. గతేడాది అక్టోబర్ లో 11.77 శాతం అధికంగా వర్షపాతం నమోదైతే.. ఈ ఏడాది 19.72 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అధిక వర్షాలతో పత్తి, మిరపతో పాటు ఉద్యాన పంటలకు కూడా అపార నష్టం కలిగిందన్నారు. త్వరలోనే పంట నష్టాన్ని అంచనా వేసి.. ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తారని చెప్పారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు.

*మేడవాగు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు *

పెదకూరపాడు నియోజకవర్గంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. ప్రతి మండలంలో వ్యవసాయ శాఖ, హార్టీకల్చర్ డిపార్ట్ మెంట్ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మేడవాగు వల్ల రైతులకు అధిక వర్షం కురిసినప్పుడు పంట నష్టం జరుగుతోందన్నారు. మేడవాగును బాగు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

మంత్రి అంబటి రాంబాబు , జాయింట్ కలెక్టర్ ద్వారా మేడవాగు ఇబ్బందులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు కేవైసీ తప్పని సరిగా చేయించుకోవాలని సూచించారు. హార్టీ కల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ అధికారులు వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి.. త్వరితగతిన రైతులను నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఆదేశించినట్టు చెప్పారు.

ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారని.. ఈ వర్షంతో అదంతా నష్టపోయినట్టేనని చెప్పారు. మళ్లీ పంటలు వేసినా చేతికందే పరిస్థితి లేదన్నారు. ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేందుకు తాను కృషి చేస్తానన్నారు. నష్ట తీవ్రతను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీలకు అతీతంగా రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.


SAKSHITHA NEWS