శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించి అక్కడి ఏర్పాట్లను జోనల్ కమిషనర్ శ్రీమతి.మమత తో కలిసి పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..*
ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రాల ఇంచార్జ్ అధికారులు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని,ప్రతి కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షించాలి..
శశిగుడా వార్డ్ కార్యాలయం,పీజేఆర్ నగర్,ద్వారక నగర్,వెంకటేశ్వర నగర్,ఆర్.పి కాలనీ,అల్విన్ కాలనీ/వివేకానంద నగర్ డివిజన్.
నడిగడ్డ తండా,మియపూర్ డివిజన్.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని,ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,ప్రజా పాలనకు నిదర్శనమే నేటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని అన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..
ఈరోజు అల్విన్ కాలనీ డివిజన్ శంశిగుడాలో వార్డ్ కార్యాలయం,పీజేఆర్ నగర్ నందు ఏరాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంలో ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే,బయట ఉన్న అపోహలను నమ్మవద్దని,దరఖాస్తు ఫారం లు పుష్కలంగా సెంటర్ ల వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందని,ప్రజలు నేరుగా సెంటర్ ల వద్దకు వచ్చి అప్లికేషన్స్ ఫారం లు తీసుకోవచ్చు అని,ఫారం ఫిల్ చేయడానికి ఎలాంటి సందేహాలు ఉన్న అధికారుల సహాయం తీస్కొని ఫారం ఫిల్ చేయవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి జనవరి 6 వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.ప్రజల నుంచి మహాలక్ష్మి,అభయ హస్తం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని,రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని,అర్హులైన లబ్ధిదారులందరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..