ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
*బండారు పల్లి గ్రామములో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క *
ములుగు మండలం బండారు పల్లి గ్రామం గిరిజన భవన్ లో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి విజయవంతం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి జరిగే విధంగా క్షేత్ర, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని లాంచనంగా ప్రారంభించడంతో పాటు 5 లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు.
ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6, 2024 వరకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఇందుకుగాను పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో ప్రజల స్థితిగతులకు అనుగుణంగా సర్వతో ముఖాభివృద్ధి కొరకు కృషి చేయాలని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మనం చేసే కృషితో ప్రజల గుండెల్లో ఉండిపోతామని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఐటిడిఎ పిఓ అంకిత్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధి లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా,బ్లాక్
మండల,గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు