సిపిఐ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నాయకులు సిపిఐ, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంలను హైదరాబాద్, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు కలిసి అగ్రిగోల్డ్ బాదితుల సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని, తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ అగ్రిగోల్డ్ బాదితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.బాలమల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షల మంది ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విలువ సుమారుగా రూ.1000 కోట్లు ఉంటుందని, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సింది కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లింస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేయాలని, అగ్రిగోల్డ్ సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.బాలమల్లేష్, ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, ఎక్జిక్యూటివ్ సభ్యురాలు నల్లబోలు సునీత, సిపిఐ నాయకులు ఎర్రా బాబు, సంజీవరెడ్డి, రమ, వేంపటి కుముద, వేంపటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.