హ్యాట్రిక్ కొట్టడమే మన లక్ష్యం..

Spread the love

మళ్ళీ బి అర్ ఏస్ ను అధికారం లోకి తేవాల్సిన బాధ్యత మనపై ఉంది..

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సరికొత్త జోష్‌.

మనం చేసిన పథకాలు విరివిగా చర్చ జరిగేలా చూడాలి.. నగరాభివృద్ధిని వీడియోస్ రూపంలో డివిజన్లలో ప్రదర్శించాలి.

నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన మంత్రి పువ్వాడ.

కార్యకర్తలకు వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బి అర్ ఏస్ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం త్రీ టౌన్ గుర్రం ఫంక్షన్ హాల్ నందు త్రీ టౌన్ పరిధిలోని డివిజన్ ల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. మన కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని, ముఖ్యమంత్రి కేసీఅర్ అందించిన బి అర్ ఏస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కుటుంబ పెద్ద అయిన కేసీఅర్ ని గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచిందని కొనియాడారు.


మీకు అన్ని విధాలుగా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ను మీ ద్వారా స్థానిక ప్రజలకు అందించాలని సూచించారు. మునుపెన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుని వలె పని చేయాలని, మనం చేసిన, చేస్తున్న అభివృద్ధిని వారికి తెలియచెప్పాలని కోరారు. గడచిన కాలంలో లక్షల మందికి వివిధ రకాలుగా లబ్ధి చేకూరేలా పని చేశామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి హ్యాట్రిక్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం చరిత్రలో నిలిచిపోయే విధంగా మురికి కూపంగా ఉన్న గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించి అభివృద్ధి చేసుకున్నామని, ఈ ఒక్క పనితో దాదాపు 11 డివిజన్లలలోని ప్రజలు మూరుగు, దోమలు, అనారోగ్యం నుండి విముక్తులను చేసి 10 పార్కులు ఎర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచామని గుర్తు చేశారు. ఆయా డివిజన్ల ప్రజలకు మాత్రమే కాకుండా నగరం మొత్తం మనం చేసిన మంచి పనులను విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలకు విరివిగా చేరవేయల్సిన బాధ్యత మనపై ఉందని, మనం చేసిన అభివృద్ధిని మనమే చాటి చెప్పాలని కోరారు. అవసరం అయితే డివిజన్ లలో మనం చేసిన అభివృద్దిని వీడియో రూపంలో ప్రదర్శించి ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు భోజనాలను మంత్రి పువ్వాడ స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపిలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, సుడా చైర్మన్ విజయ్, మేయర్ పునుకొల్లు నీరజ, ఏ ఎం సి చైర్మన్ శ్వేత, బి అర్ ఏస్ టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, త్రీ టౌన్ ఇంఛార్జి ఆర్ జ్ సి కృష్ణ, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణరావు, త్రీ టౌన్ డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page