Water should be given to the old canal of Paleru from the main canal
మెయిన్ కెనాల్ నుండి పాలేరు పాత కాలువకు నీళ్లు ఇవ్వాలి
ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పొంగులేటి ప్రసాద్ రెడ్డికి రైతులు వినతి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
నేలకొండపల్లి, మెయిన్ కెనాల్ నుండి పాలేరు పాత కాలువకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ని చెన్నారం, మండ్రాజుపల్లి, కొత్తూరు, రామచంద్రాపురం, సుర్దేపల్లి, పైనంపల్లి బొదులబండ గ్రామాలకు చెందిన రైతులు కోరారు. పాలేరు పాత కాలువకు నీళ్లు సరిగా రాకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ప్రసాద్ రెడ్డి కి వివరించారు. రాజేశ్వరపురం గ్రామం వద్ద మెయిన్ కెనాల్ మరియు పాలేరు పాత కాలువకు అనుసంధానం చేస్తూ పైపులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత న్యాయం చేయాలని కోరారు. తద్వారా ఎండాకాలంలో తాగునీరు, సాగునీరు కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. కాలువలకు అనుసంధానం చేస్తూ ఓవర్ టన్నల్ కడితే రైతులకు మరింత న్యాయం చేసిన వారవుతారని అన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రపోజల్ ఉన్నప్పటికీ కార్యచరణ దాల్చలేదని ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పది గ్రామాలకు చెందిన రైతుల ఆరు వేల ఎకరాల భూమి ఎండిపోకుండా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీతారామ ప్రాజెక్టు ద్వారా మరియు మున్నేరు నుంచి గ్రావిటి ద్వారా కూడా పాలేరు రిజర్వాయర్ లో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందని అన్నారు. రైతుల వినతిని మంత్రి దృష్టికి తీసుకెల్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేష్, యడవల్లి సైదులు, సూరపనేని రామకృష్ణ, తలసీల గోపి, చింతనిప్పు సైదులు, కుక్కల హనుమంతరావు, వందనపు నాగేశ్వరరావు, నెల్లూరి అప్పారావు, వజ్జా శ్రీను, యర్రా బాబు తదితరులు పాల్గొన్నారు