వంగూరు మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణాఇసుక మాఫియాను పట్టించుకోని వంగూరు ఎస్సై

Spread the love

ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను రాత్రి పది గంటలకు పట్టుకున్న కోనాపూర్ గ్రామస్తులు. రైతన్నలు


సాక్షిత : 100 డయల్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన రైతన్నలు. వంగూరు పోలీసులు రావడం ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను వదిలేయడం వంగూరు ఎస్సై పై పలు ఆరోపణలు చేస్తున్న కోనాపూర్ గ్రామస్తులు రైతన్నలు

వంగూరు మండల కేంద్రంలోనీ ఉల్పర వాగులో సుమారు 30 ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా ఉదయం నుండి రాత్రి వరకు విచ్చలవిడిగాసాగుతుందని. ఎవరైనా పూర్తి సమాచారం సంబంధిత అధికారులకు ఇస్తే వారి ఫోన్ నెంబర్ తో సహా ఆక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు ఇచ్చేస్తున్నారని గ్రామస్తుల రైతన్నల ఆవేదన. అధికారులు రావడం ఇచ్చినంత తీసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుందని అక్రమ ఇసుక మాఫియాలు మాత్రం అరికట్టడం లేదని అధికార పార్టీ అండదండలతో అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని గ్రామ పెద్దాయనవి రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లు ఉండడం కోసమేరుపు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ఉల్పర వాగు నుండి రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి 9 గంటల నుండి ఉదయం వరకు సుమారు 30 ట్రాక్టర్ల అక్రమ ఇసుక రవాణా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఒక్క టాక్టర్అక్రమ ఇసుక రవాణా చేసుకోవాలంటే 10000. సంబంధిత అధికారులకు ఇవ్వాలని.100కు ఉన్నవారికి ప్రతిరోజు 500 చొప్పున వెయ్యి రూపాయలు కట్టాలని. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అందరికీ ఇచ్చి న తర్వాతనే మేము అక్రమ ఇసుక రవాణా చేస్తున్నామని అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు దర్జాగా చెప్తున్నారు. ఇంకా గ్రామస్తుల. రైతన్నల సమాచారం మేరకు100 డయల్ కు 100 సార్లు ఫోన్ చేసిన అటువైపు అధికారులు రావడమే లేదని. వంగూర్ ఎస్సై అక్రమఇసుకనుపట్టించుకోవడంలేదని కోనాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.చేసేది ఏమీ లేక రాత్రి10:00 ప్రాంతంలో 5 అక్రమ ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు రైతన్నలు ఆపడం జరిగిందని అధికారులకు సమాచారం ఇచ్చిన అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు గ్రామస్తులపై దాడి చేసే వరకు గ్రామస్తులు చంపే వరకు రావడం సంబంధిత అధికారులు అటువైపు రావడంలేదని ఈ అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ దృష్టిసరించి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఉల్పర గ్రామానికి చెందిన వ్యక్తులు రాజేష్.రే ణు. సత్యం. శ్రీనివాసులు. ఎల్లికల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోనాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page