వీణవంక మండలంలోని విద్యార్థులచే ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

Spread the love

Voter’s Day Pledge by Students of Veenavanka Mandal

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని విద్యార్థులచే ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 326 వ ఆర్టికల్, 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరునికి కుల, మాత, భాష,ప్రాంత, పేద, ధనిక,లింగ తరతమ భేదాలు లేకుండా సార్వజనీన ఓటు హక్కును కల్పిస్తుందన్నారు. ప్రజాస్వామ్య విజయానికి ఓటర్లు పట్టుకొమ్మలన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలలో యువ ఓటర్లు 20 నుండి 25% గా నామమాత్రంగా పాల్గొనడంతో, 2011 జనవరి 25 నుండి ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
1950 జనవరి 25 న భారత ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చిన సందర్భంగా గుర్తుగా ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ థీమ్ తో పెద్ద మొత్తంలో 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసి, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసి, ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విజయానికి కృషి చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవ లక్ష్యం అన్నారు.2019 లోకసభ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటర్స్ 10 కోట్లకు గాను నాలుగు కోట్ల మంది మాత్రమే ఓటర్స్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నారని, 2024 లోకసభ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వేణు,లింగయ్య, రాజశేఖర్,జైపాల్ రెడ్డి,శ్రీనివాస్,ప్రవీణ్,జయ,శాంత,సువిత,అరుణ శ్రీ, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page