“కాకాణి మేలు ఈ జన్మకు మరువలేమంటున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు”
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతోమంది శాసనసభ్యులు గెలిచినా, మంత్రులైనా తమ గోడు పట్టించుకోలేదని మంత్రి కాకాణి మాట ఇచ్చిన 3 నెలలు గడవక ముందే, గ్రామానికి 1కోటి17 లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేయించినందుకు చెప్పలేని ఆనందం కలుగుతుందన్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు.
సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తూ, స్మశాన వాటిక లేక, అనేక ఇబ్బందులు పడుతున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామలకు స్మశాన స్థలం కేటాయించి, అభివృద్ధి చేసి, అప్పగించినందుకు మంత్రి కాకాణికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన గ్రామస్తులు.
SPS నెల్లూరు జిల్లా:
తేది:27-03-2023
సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, వల్లూరు పంచాయతీ, పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామాలకు వెళ్లే రహదారిని 1కోటి 17 లక్షల రూపాయలతో నిర్మించి, ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా, పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామాలలో పర్యటించినప్పుడు తమకు రోడ్డు లేక, నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు చెప్పగానే, రోడ్డు మంజూరు చేయించి, నిర్మాణం పూర్తి చేయించి, ప్రారంభించడం సంతోషంగా ఉందన్న మంత్రి కాకాణి.
👉 దశాబ్దాల తరబడి సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మంత్రి కాకాణి.
👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసన సభ్యునిగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణతో మంత్రిగా కొనసాగే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తూ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరికీ “ఇంటి బిడ్డ” గా అతి పెద్ద సేవకుడిగా నిరంతరం సేవలందిస్తానని భరోసానిచ్చిన మంత్రి కాకాణి.