కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి

Spread the love

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి.
రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడడ్డుకోకపోతే మూల్యం తప్పదు

సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు హెచ్చరించారు.

స్థానిక సిపిఐ ఆఫీస్ కోట రెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు‌ గావిభజన చట్టంలో పొందుపరచింది.ప్రాజక్ట్ ఎత్తు 150 అడుగుల ఎత్తు ను 135 అడుగులు కు తగ్గించి 196 TMC నీటి నిల్వలుసామర్ద్యం నుండి 92 TMC తగించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది.అదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి కి అవరోధం ఏర్పడటమే గాక నీటి నిలువలు సామర్థ్యం తగ్గిపోయి ప్రకాశం,రాయలు సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.కావున పోలవరం జాతీయ ప్రాజెక్టుగా రూపొందించి న ఎత్తు,నీటి నిల్వలు సామర్థ్యం యథాతథంగా ఉంచాలనిడిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రానికి ఇత అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడక పోవడంపై సిపిఐ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని సిపిఐ హేచ్చరిస్తున్నది.
ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు ఎం లక్ష్మీనారాయణ, యువజన సంఘం నాయకులు దుర్గాప్రసాద్, వెంకట్రావు, మాధవ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page