SAKSHITHA NEWS

*కొత్తగడి పరిసర ప్రాంతాలకు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని 1,12,13 వ వార్డులు కొత్తగడి లో ఉదయం 06:30 AM నుండి 10:00 AM వరకు పర్యటించారు.
కత్తగడిలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు, ట్రాన్స్ఫార్మర్ కు దిమ్మేలు నిర్మించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, లైన్ షిప్టింగ్ చేయాలన్నారు.
కొత్తగడి లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, పాత స్థంబాలు మరియు వాటికీ ఉన్న తీగలను తొలగించి, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని, తదితర విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.


మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ… నీటి సమస్య రాకుండా.. నీటి సరఫరా చేయాలన్నారు.
మిషన్ భగీరథ మంచినీటిని తాగాలని, అధికారులు అందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
వార్డులలో అండర్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
కొత్తగడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుబంధు పథకం ద్వారా నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షలు పెట్టుబడి సహాయం అందించిందన్నారు.
కొత్తగడి పరిధిలో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా పదకొండు మంది రైతులు మరణించగా 5 ఐదు లక్షల చొప్పున 55 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిందన్నారు.
అనంతరం కొత్తగడి కి చెందిన 8 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS