కేటీఆర్ కాలనీలో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్
124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో డ్రైనేజీ మరియు చెత్త సమస్యలను బస్తి వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి కేటీఆర్ నగర్లో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో చెత్త సమస్య ఎక్కువగా ఉందని, పారిశుధ్య కార్మికులతో గ్యాంగ్ వార్ పెట్టి శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బస్తి వాసులందరు సమావేశమై కాలనీలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో నివాసిస్తే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను బస్తి వాసులకు వివరించి చెత్తను కాలనీ పరిసరాలలో వేయకుండా జి.ఎచ్.ఎం.సి ఆటోలలో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలని బస్తి కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, దుర్గేష్, కాలనీ వాసులు కరుణాకర్, అనిల్ కుమార్, యాకుబ్, బబన్, పాషా, మున్ని, అమీర్, అలీ, గౌస్, మోహన్, రవి, శ్రీనివాస్, కృపాకర్, యూసఫ్, ఇర్ఫాన్, రమేష్ నాయక్ జి.ఎచ్.ఎం.సి SRP సత్యనారాయణ, SFA వీరారెడ్డి, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు