అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ( ప్రభు )

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి లో గల స్పందన అనాధాశ్రమం లోని బాలికలకు జమ్మికుంట పట్టణంలోని నందిని డ్రెస్సెస్ అధినేత పాకాల నరసింహారెడ్డి సహకారంతో బాలికలకు మంగళవారం రోజున దుస్తులు పంపిణీ చేసిన దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ అనాధలైనటువంటి బాల బాలికలను అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు అదేవిధంగా బర్త్డేలే కానీ వివిధ కార్యక్రమాలు పిల్లలచే నిర్వహించి కేక్ కట్ చేస్తూ చలమనవుతున్న నాయకులు గాని ఇతరులు గాని చేయడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మానుకొని వారికి కావలసిన నాణ్యమైన విద్యకై నాణ్యమైన భోజనానికై వాళ్ల కావలసిన కనీస అవసరాలను తీర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పందన అనాధాశ్రమం నిర్వాహకులు గోపరాజు వీరస్వామి, భారత రాష్ట్ర సమితి యువజన విభాగం హుజరాబాద్ నియోజకవర్గం నాయకులు అంబాల రాజు, యువ నాయకులు బండారి ప్రశాంత్, అంబాల రాజయ్య పల్లె తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page