SAKSHITHA NEWS

హైదరాబాద్‌: ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) ఎక్స్‌లో తెలిపింది.

అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో సంస్థ ఈ వివరణ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇటీవల ‘ప్రజాపాలన’లో ఈ పథకానికి 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల ఒకటి నాటికి రాష్ట్రంలో 1.31కోట్ల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2022-23 ఏడాదిలో సగటున నెలకు 200 యూనిట్లలోపు వినియోగించిన ఇళ్లు ఎన్ని ఉన్నాయో డిస్కంలు పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలను విడుదల చేశాక అర్హుల గుర్తింపుపై మరింత స్పష్టత వస్తుందని విద్యుత్‌ అధికారులు తెలిపారు.

WhatsApp Image 2024 02 07 at 4.14.11 PM

SAKSHITHA NEWS