కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ

Spread the love

26-05-202౩
న్యూఢిల్లీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ

న్యూఢిల్లీ:

  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.
  • దాదాపు 40 నిమిషాలసేపు సాగిన సమావేశం.
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం.
  • 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం.
  • రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, రూ.6,756.92కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించిన ముఖ్యమంత్రి. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నీ గుర్తుచేసిన సీఎం.
  • ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని విజ్ఞప్తిచేసిన సీఎం.
  • రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు – నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరోతరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపిన సీఎం.
  • అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టామని,చ ఇప్పటికే దీనికోసం రూ.౪వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొ్న్న సీఎం.
  • రాష్ట్ర ప్రభవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి.
  • రేపు నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గోనున్న ముఖ్యమంత్రి.

Related Posts

You cannot copy content of this page