మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం

Spread the love

మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం

మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా మే 28న ప్రారంభానికి ఏర్పాట్లు

లకారంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన నాయకులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులను ఖమ్మం నగర కమ్మ సంఘం పెద్దలు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయిందని విగ్రహ తరలింపుకు రంగం సిద్ధం చేశామని మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను నిర్వహిస్తామని చెప్పారు.బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది అని తెలిపారు.ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నట్లు పేర్కొన్నారు.రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవచూపారు అని అన్నారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు అని తెలిపారు.ఈ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కార్పొరేటర్ కర్నాటి కృష్ణ గారు,ఖమ్మం నగర కమ్మ సంఘం అధ్యక్షులు వల్లభినేని రామారావు ,గరికపాటి వెంకటేశ్వరరావు,కార్యదర్శి సరిపూడి సతీష్ ,మంత్రి పీఏ చిరుమామిళ్ల రవి కిరణ్ ,నాయకులు బత్తుల మురళి,పైడిపల్లి సత్యనారాయణ, వడ్లముడి గోపాల్ రావు, ప్రసాద్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page