
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు, 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం,
చోరీ చేసిన వాహనాలను నూజండ్ల మండలం రవ్వారం లో దాస్తున్న దోంగలు,
ఐనఓలు ఎస్ఐ కృష్ణారావు, సిబ్బంది ని అభినందించిన సిఐ ప్రభాకర్.
వినుకొండ:- ఐనఓలు ఎస్ఐ కృష్ణారావు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు… ఈ సంధర్భంగా ఐనఓలు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డీఎస్పీ నాగేశ్వరరావు అదేశాలతో జిల్లా లో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను నూజండ్ల మండలం రవ్వారం లో దాచి ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు… ద్విచక్ర వాహన చోరీ దొంగల్లో ఒకరు రవ్వారం గ్రామం, మరోక యువకుడు రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డి పాలెం కు చెందిన వారిగా తెలిపారు.
గత కొద్ది రోజుల్లోనే మండలంలో పలువురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 26 ద్విచక్ర వాహనాలు, 70 ట్రాన్స్ ఫార్మర్స్ లోని కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని విధి నిర్వహణలో విశేష కృషి చేసిన ఐనఓలు ఎస్ఐ కృష్ణారావు, సిబ్బంది ని, సిఐ అభినందించారు… ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డు కు సిఫార్సు చేస్తామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app