Traffic police conducted counseling for auto drivers
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ :
ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో
నగరంలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ అంజలి తమ సిబ్బందితో నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాత బస్‌స్టాండు వద్ద యూనిఫాం లేకుండా ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని సిఐ అంజలి సూచించారు.
ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్సు, వాహన రికార్డులు, యూనిఫామ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం చేయరాదని సూచించారు.
పరిమితికి మించి ప్రయాణికులను వాహనంలో ఎక్కించుకోరాదని,ఆటోడ్రైవర్లు విధిగా ఇన్సూరెన్స్ కట్టాలని, రోడ్ ట్యాక్స్ చెల్లించాలని, ఆటోలలొ సౌండ్ బాక్సులు ఉంటే వాటిని తొలగించాలన్నారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. అతివేగంగా వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు.