ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

Spread the love

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రించేందుకు దృష్టి పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్ మరియు బస్టాండ్, వైరా రోడ్డు ప్రాంతం నిత్యం ప్రయాణికులతో,
ఆటోలతో రద్దీగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత విషయంలో అవగాహన కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే ఆకతాయిలపై చర్యలు తప్పవని తెలిపారు. “మీ ఆటోలో కూర్చున్న ప్రయాణీకులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడబడితే అక్కడ ఆటోలు నిలపడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందనే విషయాన్ని గ్రహించి ఆటోలు క్రమపద్ధతిలో నడుపుకోవాని సూచించారు. డ్రైవర్లందరూ తప్పనిసరిగా యూనిఫాం, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వారి వాహనాలకు ఆర్ సి కలిగి ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో నగరంలో పోలీసులు తీసుకునే చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన పలు ప్రమాదాల సంఘటనల్లో ఆటోలు కారణంగా మారుతున్నాయని, ఇలాంటి సంఘటలనకు దూరంగా ఉంటూ…తమ ప్రయాణాలు సాఫీగా సాగించుకోవాలని పెర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రమాదాల భారీన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ మోహన్ బాబు, ఎస్సై రవి, వెంకన్న, ఆర్ఎస్సై సాగర్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page