సాక్షిత : * కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ లలో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * వరద ముంపునకు గురైన ప్రాంతాలైన సఫ్ధర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, రామారావు నగర్, లలో కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలకు గురైన ప్రజల ఇంటింటికి వెళ్లి పలకరించి వారికి భోజనం ఏర్పాట్లు చేసి వారికి పునరావసతి కేంద్రం సఫ్దర్ నగర్ పబ్లిక్ హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందని సఫ్దర్ నగర్ నివాసులకు తెలియజేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అందరు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీరు నిలవకుండా చూడాలని, భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎటువంటి సమస్యలు ఉన్న అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జిహెచ్ఎంసి సిబ్బంది, అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, సలీం, షేక్ రఫిక్, అస్లాం, సంజీవ, యోగి రాజు, అమీన్, సలీం, నజ్మా , పర్వీన్ సుల్తానా,తదితరులు పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీరు నిలవకుండా చూడాలి…సబీహా గౌసుద్దీన్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…