మూడు రాజధానులు ఉండాలనే ఈ మహా ప్రదర్శన

Spread the love
This grand show should have three capitals

మూడు రాజధానులు ఉండాలనే ఈ మహా ప్రదర్శన తిరుపతి చరిత్రలో నిలిచిపోతుంది – ఎమ్మెల్యే భూమన

…….

సాక్షిత తిరుపతి : అధికార వికేంద్రికరణతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే ఆలోచనతో మూడు రాజధానులు ఉండాలనే నిర్ణయంపై మద్దతుగా శనివారం జరిగిన ఈ ప్రజా మహా ప్రదర్శన తిరుపతి చరిత్రలో నిలిచిపోతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.

రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నినాదంతో మూడు రాజధానులు ఉండాలనే నిర్ణయాన్ని సమర్ధిస్తూ తిరుపతి నగరంలో కృష్ణాపురం ఠాణా వద్ద నుండి కనివిని ఎరుగని రీతిలో మహిళలు, పెద్దలు, యువతీ యువకులు, టిటిడి, మునిసిఫల్ ఉధ్యోగ నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిద రంగాల వ్యాపారస్థులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఉధ్యోగ సంఘాల ప్రతినిధులు, కళాకారులు, వివిధ కులవృత్తుల సంఘాల నాయకులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు హాజరై మహా ర్యాలిలో పాల్గొంట్టూ నినాదాలతో గాంధీరోడ్, తిలక్ రోడ్ల మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం ముందర ఏర్పాటుచేసిన సభకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న మహోన్నత ఆశయంతో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్న దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో అందరిలో ఆనందం వ్యక్తం అవుతోందని, అలా రాయలసీమ ప్రజల కన్నీటి ఆకారం ఈ విధంగా ఉప్నెలా ఈ మహా పాదయాత్రగా వచ్చిందని భూమన అన్నారు.

స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సీమకు నీటి ప్రాజెక్టులు
సాధ్యమయ్యాయని గుర్తుచేస్తూ, చంద్రబాబు పాలనలో ఇటు రాయలసీమకు అటు ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు.

ఈక్రమంలో
విశాఖ పరిపాలనా రాజధాని కావాల్సిన అవసరాన్ని జగన్
గుర్తించారని అయితే చంద్రబాబు ఆయన అనుచరులు మూడు రాజధానుల మహా యజ్ఞంలో రక్తం పోసే రాక్షసుల్లా మారారని విమర్శించారు.న్యాయ రాజ ధానిగా కర్నూలుకు పెరుగుతున్న మద్దతుకు తిరుపతి స్పందనను
గ్రహించాలన్నారు.

తాను జాతీయ నాయకుడో, రాష్ట్ర నాయకుడో కనీసం మంత్రిని
కూడా కాదని, కేవలం ఒక ఎమ్మెల్యేనని తన అభ్యర్ధనతో ఓక్క తిరుపతిలోనే కదలివచ్చిన ఈ జనంను చూస్తే చంద్రబాబుకు నిద్రపట్టదన్నారు. జగన్ మోహన్ రెడ్డి


పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ర్యాలీనే నిదర్శనమని, గత 50 ఏళ్ళ తిరుపతి చరిత్రలో మునుపెన్నాడు రానంతగా ఈ ర్యాలికి నేడు ప్రజలు రావడం జరిగిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ మూడు రాజధానులకు
వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, సీఎంకు అందరూ అండగా నిలవాలని పిలునిచ్చారు.

ఈ ఆత్మ గౌరవ ర్యాలికి వచ్చినంతగా జనాన్ని తిరుపతిలో ఇంతకుమునుపు తానెన్నడు చూడలేదని ఎంపి గురుమూర్తి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ సీఎం జగన్
మూడేళ్ల పాలన ఎంతో ముందు చూపుతో సాగుతోందని, అందులో భాగంగానే అధికార
వికేంద్రీకరణకు మూడు రాజధానులను ప్రతిపాధించారన్నారు.

దీనికి ప్రజల సంపూర్ణ
మద్దతు ఉందనడానికి ఈ ర్యాలీనే నిదర్శనమన్నారు. యువ నాయకుడు, డిప్యూటి మేయర్
భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి యువత తరపున గట్టిగా మద్దతు పలకాలని, ఈ ప్రయత్నంలో అందరం చివరి దాకా


నిలుద్దామని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ శైల కుమార్ మాట్లాడుతూ మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మ
గౌరవ ప్రదర్శన అన్నారు. సీమ వాసుల గర్జనకు ఇది నిదర్శనమన్నారు.

Related Posts

You cannot copy content of this page