మూడో విడత అక్రిడిటేషన్ లను వెంటనే మంజూరు చేయాలి

Spread the love

The third round of accreditations should be granted immediately

మూడో విడత అక్రిడిటేషన్ లను వెంటనే మంజూరు చేయాలి
అర్హులైన జర్నలిస్టులందరికీ వర్తింపజేయాలి
జిల్లా కలెక్టర్ కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) వినతి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులకు
మూడో విడతలో అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం వినతిపత్రం అందజేశారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి అర్హులైన జర్నలిస్టులందరికీ మూడో విడతలో అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ వి. పి. గౌతమ్ దృష్టికి తీసుకువెళ్లారు.


ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… అక్రిడేషన్ ల కోసం జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మూడో విడత అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. యమ్ ప్యానల్ లిస్టులో ఉండి, గడచిన రెండు దఫాలలో అక్రిడేషన్లు రాకుండా మిగిలిన జర్నలిస్టులందరికి మూడో విడతలో కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీని మరో మారు సమావేశపరిచి అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన విధి విధానాలను తయారుచేసి సిద్ధంగా ఉంచాలని అక్కడే ఉన్న డిపిఆర్ఓ గౌస్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు (ఐజేయు) వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, టీఎస్ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి రామకృష్ణ, సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, మహిళా ప్రతినిధి వంగూరు ఈశ్వరి, నాయకులు వడ్డే రామారావు, మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page