బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది..
జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న.. ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎంక్లవ్ వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు అని అన్నారు, చేనేత కార్మికుల సంక్షేమంలో భాగంగా వారికి నెలకు 2,016 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పింఛను అందిస్తున్నదని,’నేతన్న బీమా’ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనం కల్పించామని అన్నారు. ‘నేతన్నకు చేయూత’ పథకం అమలు చేస్తూ వారి ఆదాయం పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారీ. ప్రభుత్వం రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసిందని, పావలా వడ్డీ ద్వారా రూ.120 కోట్ల రుణాలను 523 సొసైటీలకు అందించడం జరిగిందని,చేనేత కార్మికుల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైరాం, పద్మశాలి సంఘం నయకులు బేతి గోపాల్, ఎం. జనార్దన్, జల్దా లక్ష్మినాథ్, హారి కృష్ణ, వెంకటేష్, రఘునందన్, బాలు నేత, లక్ష్మీకాంత్,గజంశ్రీనివాస్,రాజేష్,అనంత రామ్,బి.అశోక్,ఆంజనేయులు,బోడ.సాయిలు,అప్పారావు,నాగభూషణం,గుర్రం బాలరాజు,శ్రీకాంత్, నవీన్,బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, సమ్మయ్య నేత తదితరులు పాల్గొన్నారు.