అన్ని కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

Spread the love

The sole objective is to perfect all the colonies

అన్ని కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

రూ.3.72 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో సుమారు రూ.3.72 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు వుడ్స్ ఎంక్లేవ్ లో రూ.13.20 లక్షలతో నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్, చైన్ లింక్ మెష్, పార్క్ గేట్ పనులు ప్రారంభించారు.

గంగాఎంక్లేవ్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించి, రూ.36.60 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. గంగాఎంక్లేవ్ నుండి సెంట్ ఆన్స్ స్కూల్ సర్వీస్ సీసీ రోడ్డు వరకు రూ.80 లక్షలతో మరమ్మత్తు పనులకు శంఖుస్థాపన చేశారు. బౌద్ధ నగర్ లో రూ.32 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో దుర్గా ఎస్టేట్ లో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు.

రూ.79.40 లక్షలతో రుక్మిణి ఎస్టేట్ లో పూర్తి చేసిన సీసీ రోడ్డు, ఇంటర్నల్ రోడ్లు మరియు పార్కుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రశాంత్ నగర్ లో రూ.39 లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.52 లక్షలతో ప్రసూన నగర్ లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను నెంబర్ గా తీర్చిదిద్దుతుమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, స్థానిక వార్డు సభ్యులు

సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, నాయకులు కుంట సిద్ధి రాములు, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, అరుణ రెడ్డి మరియు ఏఈ సురేందర్ నాయక్, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page