ఇందిరమ్మ పాల‌న‌లో వెలుగుల ప్రస్థానం

Spread the love

యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులు
డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం


ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబ‌ర్ 7న ప్ర‌మాణా స్వీకారం చేసి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క యాదాద్రి, భ‌ద్రాద్రి ప‌వ‌ర్ ప్లాంటు నిర్మాణాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. గ‌త పాల‌కుల వైఫ‌ల్యాల వ‌ల్ల నిలిచిపోయిన ప‌నుల గురించి తెలుసుకొని యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఆప‌నులు పూర్తి చేయ‌డానికి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించారు. నేరుగా పవర్ ప్లాంట్ ను సందర్శించి అధికారుల‌తో సమీక్షించారు.

గత మూడు నెలల కాలంలో పలలుమార్లు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షలు జ‌రిపి ప‌నుల్లో వేగం పెంచిన‌ ఫలితంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న పర్యావరణలు అనుమతులు మంజూరయ్యాయి. భ‌ట్టి విక్ర‌మార్క చొర‌వ‌తో సాధించిన అనుమ‌తుల వ‌ల్ల ఇందిర‌మ్మ పాల‌న‌లో వెలుగుల ప్ర‌స్థానం మొద‌లైంది. 50% విదేశీ బొగ్గు, 50% స్వదేశీ బొగ్గుతో దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని 2017 జూన్ 15న నాటి ప్రభుత్వం కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులు సాధించింది. ఒప్పందానికి భిన్నంగా నూరు శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసింది. మార్చిన టెక్నాలజీతో పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాయి. టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు పొందాలని 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించి, అనుమతులు నిలిపేసింది.

2023 డిసెంబర్ 6 వరకు అధికారంలో ఉన్న గత పాలకులు పర్యావరణ అనుమతులు సాధించేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. దీంతో నిర్మాణ ప‌నులు ఆగిపోయాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వ‌చ్చిన త‌రువాత‌ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పట్టు పట్టి మారిన టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు సాధించేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజానీకాన్ని సమన్వయం చేసుకోని ఈ సంవత్సరం ఫిబ్రవరి 20న మరో సారి ప్రజాభిప్రాయసేకరణ విజయవంతంగా పూర్తి చేయించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించిన షరతులు అన్నిటిని పూర్తిచేసి రెండు నెలల కాలంలోనే అనుమతులు సాధించారు. ఫలితంగా 2025 ఫిబ్రవరి నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అడ్డంకులు తొలగిపోయాయి. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు రావాడానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ఈసంద‌ర్భంగా డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page