పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి

Spread the love

పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి

వ్యవస్థీకృత నేరాలపై నిరంతరం నిఘా

సీసీ కెమెరాల ఆవశ్యకత, ఏర్పాటుపై క్షేత్రస్దాయిలో దృష్టి

నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేసి చార్జ్ షీట్ సకాలంలో దఖాలు చేసేలా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
రోజున పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నేర సమీక్ష
సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ….
ఖమ్మం కమిషనరేట్‌ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతీ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందం గాభాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు
ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాలేజీలలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం, యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.


చట్టవిరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్స్,తీవ్రమైన నేరాలకు పాల్పడే నిందుతులపై పిడీ యాక్ట్ అమలు కోసం ప్రతిపాదన పంపాలని, ఆయా కేసుల్లో నిందుతులకు శిక్ష పడేలా చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ రూపొందించి జిల్లా సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి తీవ్రమైన కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను పకడ్బందీగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆనంతరం పోలీస్ స్టేషన్ వారిగా పలు నేరాలపై సమీక్ష జరిపారు. నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ డిసిపి (L&o) సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డిసిపి (AR) కుమారస్వామి, ఏసీపీలు గణేష్,రామోజీ రమేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రామానుజన్, వెంకటస్వామి, రవి,పాపారావు, సిసిఆర్బిసిఐ గోపి వ మరియు వివిధ పోలీస్ స్టేషన్ ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page