సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన లబ్దిదారులు మాస్టర్ ప్రవీన్ C/o లక్ష్మన్నకి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద 20,000 రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మాజీద్, కౌన్సిలర్ నాగిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వీరాపురం వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.