SAKSHITHA NEWS

The MLA inspected the site of the Hindu cemetery in Gajularamam with the officials

గాజులరామారంలో హిందూ స్మశానవాటిక స్థలాన్ని అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం సర్వే నెంబర్ 342, 329 వద్ద హిందూ స్మశానవాటిక కొరకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ మేరకు కొంత కాలంగా ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న ప్రజలు తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ని కోరడంతో.. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అదే విధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవ రావు, ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS