ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.
ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి సురేఖ కు పంచా యతీ రాజ్ గ్రామీణ అభి వృద్ధి సంస్థ & మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు.
మేడారం మహా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిని కోరుకున్నారు. మొదటి సారి మంత్రి హోదాలో ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం గా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు.
వారితో పాటు జిల్లా ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తదితరు లు ఉన్నారు…