సూర్యాపేట ఆర్డీవో కి వినతిపత్రం అందజేసిన పబ్లిక్ క్లబ్ సభ్యులు

Spread the love

అవినీతి చేసిన పబ్లిక్ క్లబ్ కార్యదర్శి,కోశాధికారులపై విచారణ జరపాలి :- నూకల సుదర్శన్ రెడ్డి

పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం తక్షణమే నిర్వహించాలి :- బొల్లెద్దు దశరధ

పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం బకాయిలు వసూలు చేయాలి :- బైరు శైలేందర్ గౌడ్

సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి క్లబ్ యొక్క ఆదాయ, వ్యయాలను సభ్యులకు తెలియజేయాలి

సాంస్కృతిక కార్యక్రమాల పేరిట నిధుల స్వాహా

సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ కార్యవర్గంపై సమగ్ర విచారణ చేసి కార్యదర్శి,కోశాధికారులపై చర్యలు తీసుకోవాలని సీనియర్ సభ్యులు నూకల సుదర్శన్ రెడ్డి,బొల్లెద్దు దశరధ కోరారు.

సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నందు గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని, పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీ ని నియమించాలని కోరుతూ పబ్లిక్ క్లబ్ సభ్యులు పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు, సూర్యాపేట ఆర్డీవో వీరబ్రహ్మ చారి ని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లెద్దు దశరధ మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ కు ప్రతి నెలా దుకాణాల అద్దె, ఆడిటోరియం అద్దెల ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని, కాని ప్రస్తుత కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారని, నిధులను స్వాహా చేయడంతో పాటు, క్లబ్ కు సంబంధం లేని రంగస్థల పద్యాలు, భరత నాట్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, లక్షలాది రూపాయలు స్వాహా చేశారని అన్నారు. 12 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టాలని, ప్రతి నెల క్లబ్ యొక్క ఆదాయ, వ్యయాలు క్లబ్ సభ్యులకు తెలియజేస్తూ నోటిస్ బోర్డులో పెట్టవలసి వుందని, ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. కాని ప్రస్తుత కార్యదర్శి ఎటువంటి సమావేశాలు పెట్టకుండా, ఆదాయం, ఖర్చులు చెప్పకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, నిధుల దుర్వినియోగం చేశారని వారు అన్నారు. ప్రస్తుత కమిటీ ని రద్దుచేయాలని, నూతన కమిటీ ఏర్పాటు చేయాలని, క్లబ్ నుండి అక్రమంగా డబ్బులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఎల్గూరి చంటిబాబు,శనగాని రాంబాబు గౌడ్,చెంచల శ్రీనివాస్, కక్కిరేణి శ్రీనివాస్,పొలగాని బాలు గౌడ్,పిండిగ విజయ్ కుమార్,యం.డి. ఫరీదోద్దీన్,పోలెబోయిన నర్సయ్య,దోరేపల్లి రమేష్,కర్నాటి రవి,గవ్వ కృష్ణ రెడ్డి,కుమ్మరికుంట్ల లింగయ్య,కుందామల్ల శేఖర్,సయ్యద్ ఖమ్రుద్దీన్,రాపర్తి శ్రీనివాస్గ గౌడ్, శేషయ్య,,రావుల రాంబాబు,యలగందుల సాయినేత, గుణగంటి సైదులు గౌడ్,బిక్కుమళ్ల రఘు,సైదులు మేస్త్రి,ఎల్గూరి రవి,పగిడిమర్రి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page