SAKSHITHA NEWS

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా జరుగుచున్నవి.

-అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా జరుగుచున్నట్లు అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. జిల్లాలో 13,680 మంది జనరల్ విద్యార్థులకు గాను 13,240 (96.78%) మంది విద్యార్థులు హాజరు, 440 (3.22%) మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, 2,091 మంది ఓకేషనల్ విద్యార్థులకు గాను 1,962 (93.83%) మంది విద్యార్థులు హాజరు, 129 (6.17%)మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని, మొత్తంగా 15,771 మంది విద్యార్థులకు గాను 15,202 (96.39%) మంది హాజరై పరీక్షలు వ్రాయగా, 569 (3.61%) మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకానట్లు ఆయన అన్నారు. అంతకుముందు ఉదయం అదనపు కలెక్టర్ ఇల్లందు క్రాస్ రోడ్, ఎస్ఆర్ & బిజీఎన్ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణ సరళిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. పరీక్షా గదుల్లో తిరుగుతూ, పరీక్షా నిర్వహణ తీరుని నిశితంగా గమనించారు. త్రాగునీరు, టాయిలెట్స్, గదుల్లో ఫర్నీచర్, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నియమ నిబంధనల మేరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


SAKSHITHA NEWS