మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..!

Spread the love

మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..!

పొంగులేటిని వారి అనుచరులను విమర్శించే స్థాయి ఉందా మీకు…?
రోడ్లకు ప్యాచ్లు వేయడాన్ని కూడా అభివృద్ధి అంటారా మంత్రి …!
డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కృష్ణచైతన్యకు మాట్లాడే అర్హత లేదు
మీ పార్టీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త
విలేకరుల సమావేశంలో పొంగులేటి వర్గ నేతలు దొడ్డా నగేష్, మలీదు జగన్, పరికపల్లి శ్రీను, కొప్పుల చంద్రశేఖర్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మంలో అభివృద్ధి జరిగిందని గొప్పలు చెబుతున్న మేయర్ నీరజ కూర్చునే కుర్చీనే కురుస్తుంది … కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి నిర్మించిన మున్సిపాలిటీ, కొత్తబస్టాండ్లు వర్షానికి కురవడమేనా అభివృద్ధి… ? అభివృద్ధి పై చర్చకు సిద్ధమని చెప్పిన మీరే తేదీ, సమయం, వేదిక నిర్ణయించండి పొంగులేటి అనుచరులుగా ఆ చర్చలో పాల్గొనేందుకు మేము సిద్ధమని ఖమ్మం నగర కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, పెద్ద మునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను, కొప్పుల చంద్రశేఖర్ లు సవాల్ విసిరారు. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మేము నిక్కర్లు వేసుకున్నప్పుడే ఖమ్మం అభివృద్ధి జరిగిందని ఇప్పుడు మీరొచ్చి కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. రోడ్లకు ప్యాచ్లు వేయడాన్ని కూడా అభివృద్ధి అంటారా మంత్రి అని ఎద్దేవా చేశారు.

మంత్రి హెూదాలో ఉండి తన సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించారు. స్వతంత్ర్య కార్పొరేటర్లుగా గెలిచిన మమ్మల్ని ఏనాడైనా మా డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పిలిచారా..? ప్రజాప్రతినిధులను కూడా గౌరవించలేని స్థితిలో ఉన్న మీరా పొంగులేటి శీనన్న గురించి వారి అనుచరులమైన మా గురించి మాట్లాడేది అంటూ విమర్శించారు. చింతనిప్పు కృష్ణ చైతన్య రోడ్డు కాంట్రాక్ట్ల పేరుతో అప్పటి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ అండదండలతో డబ్బులు వసూలు చేసింది…. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి నువ్వు డబ్బులు వసూలు చేసిన విషయాలు మాకు తెలియవు అనుకుంటున్నావా అని ఆరోపించారు. నీకు రాజకీయ ఓనమాలు తెలవని రోజుల్లోనే ఎం.పీ.గా తాను గెలవడంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత శ్రీనివాస రెడ్డి ది అనే విషయాన్ని మర్చిపోయావా కృష్ణచైతన్య అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీ పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని రాబోయే రోజుల్లో వారు శీనన్న గూటికి చేరడం ఖాయమని తస్మాత్ జాగ్రత్త మంత్రి అంటూ హెచ్చరికలు జారీచేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, ధరావత్ రామ్మూర్తి నాయక్, బోడా శ్రావణ్, యువనేత గోపి, నాయుడు తదితరులు ఉన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page